ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు బ్రేక్ .. ఎన్టీఆర్ కు గాయాలు

242
RRR Ntr Injuried
- Advertisement -

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ని శ‌ర‌వేగంగా జరుపుకుంటుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై కీలక సన్నివేశాలను చిత్రికరిస్తున్నారు. డివివి. దానయ్య నిర్మిస్తున్న ఈచిత్రంలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.  వడోదరలో ఈసినిమా షూటింగ్ జరపుకుంటున్న సమయంలో హీరో రామ్ చరణ్ కు తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో ఆయన మూడు వారాలు షూటింగ్ కు దూరంగా ఉన్నారు. దీంతో షెడ్యూల్ మార్చుకొని హైదరాబాద్ లో షూటింగ్ జరుపుతున్నారు చిత్రయూనిట్. ఈషూటింగ్ లో ఎన్టీఆర్ పై కొన్ని సన్నివేశాలను చిత్రకరిస్తున్నారు. అయితే ఈషూటింగ్ లో ఎన్టీఆర్ చేతికి గాయం అయ్యింది. దీంతో ఆయ‌న వెంటనే ఆసుప‌త్రికి వెళ్లి వైద్యం తీసుకున్నారు.

ఆసుప‌త్రి నుండి బ‌య‌ట‌కి వ‌స్తున్న స‌మ‌యంలో ఎన్టీఆర్ బ్యాండేజ్‌తో క‌నిపించ‌డంతో అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. ఎన్టీఆర్ ఆసుపత్రి నుంచి వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ రెండు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట వైద్యులు. దీంతో దాదాపు రెండు నెలల పాటు ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇలా చిత్ర షూటింగ్ కు ఎదో సమస్య అడ్డు రావడంతో అనుకున్న సమయానికి విడుదల అవుతుందొ లేదో అని సందేహంలో ఉన్నారు చిత్రయూనిట్.

- Advertisement -