ఈనెల 21 నుంచి ‘RRR’ సెకండ్ షెడ్యూల్..

173
RRR

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి చిత్రం త‌ర్వాత తెర‌కెక్కిస్తోన్న మూవీ ఆర్ఆర్ఆర్. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లు ఈసినిమాలో న‌టిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈచిత్రానికి యం.యం కిర‌వాణి సంగీతం అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈమూవీ మొద‌టి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. హైద‌రాబాద్ రామోజీ ఫిలీం సిటీలో జ‌రిగిన ఈషూటింగ్ లో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లు ఇద్ద‌రు పాల్గోన్నారు.

RRR Movie

రాజ‌మౌళి కుమారుడు కార్తీకేయ వివాహం కార‌ణంగా కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చారు. తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఈనెల 21 నుంచి రెండవ షెడ్యూల్ ను కూడా ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. రామోజీ ఫిలీం సిటీలో వేసిన ప్ర‌త్యేకమైన సెట్లో షూటింగ్ జ‌రుపనున్నార‌ని టాక్. రామ్ చ‌ర‌ణ్ న‌టించిన విన‌య విధేయ రామ విడుద‌లై హిట్ టాక్ తెచ్చుకున్న విష‌యం తెలిసిందే.

RRR Movie

అర‌వింద స‌మేత సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ పూర్తిగా ఈసినిమాతోనే బిజీగా ఉన్నాడు. ఈచిత్రంలో ఎన్టీఆర్ ప్ర‌త్యేక‌మైన గెట‌ప్ లో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఇద్ద‌రూ ఈమూవీ పూర్తిచేసే వ‌ర‌కూ వేరే సినిమాను ప్రారంభించ‌డం లేదు. 2020లో ఈమూవీని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది.