‘రౌడీ భాయ్’ ఫస్ట్ లుక్..

184
Rowdy Bhai

రౌడీ భాయ్ ఫస్ట్ లుక్ ని మాజీ ముఖ్యమంత్రి మరియు మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ కొణిజేటి రోశయ్య గారు మాట్లాడుతూ నేను రామ సత్యనారాయణ గారికి సినిమా పట్ల వున్న ప్రేమ.. ఇప్పటివరకు దాదాపు వంద సినిమాలుకు చేరువకి తీసుకొచ్చ్చింది. అన్ని సినిమాల్లోనూ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు నిర్మిస్తూ కొత్త కొత్త నటీ నటులను, సాంకేతిక నిపుణులను సినీ పరిశ్రమకి పరిచయం చేస్తూనే వున్నాడు. ఈ పోటీ ప్రపంచంలో ఇన్ని సినిమాలు నిర్మించిన ఆయన మరెన్నో మంచి సినిమాలు నిర్మించాలని, ఆయన ప్రతి ఒక్క సినిమా మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

నిర్మాత రామ సత్యనారాయణ గారు మాట్లాడుతూ హీరో మానస్.. షిప్ర కౌర్.. స్మైల్ శ్రీను.. సంగా.. నటించిన ఈ చితం 1st లుక్ ను లాంఛనా ప్రాయంగా మాజీ ముఖ్యమంత్రి మరియు మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అతి త్వరలో నిర్మాణ అనంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కు సిద్ధం అవుతున్నది అని చెప్పారు. సంజాన developers .జాన్ సమర్పణలో.. భీమవరం టాకీస్ నిర్మించిన ఈ రౌడీ భాయ్ చిత్రాని కి నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ.. సంగీతం..అర్జున్..కెమెరా..భాస్కర్..దర్శకుడు.. ఉదయ్. జి.. పీఆర్ఓ : మధు.. వీ.ఆర్.