రాష్ట్ర ప్ర‌జ‌లకు సంక్రాంతి శుభాకాంక్షాలుః సీఎం కేసీఆర్

161
kcr happy movement

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సంక్రాంతి శుభాకాంక్షాలు తెలిపారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. సంక్రాంతి పండుగ‌ను ప్ర‌జ‌లు సంతోషంగా, ఎంతో ఉత్సాహంతో జ‌రుపుకోవాల‌ని ఆకాక్షించారు. రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సంపదతో విలసిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాల్లో పండుగలు ముఖ్య భూమిక పోషిస్తాయని, పంటలు చేతికొస్తున్న తరుణంలో ప్రకృతిని పూజిస్తూ, మన జీవికకు పునాదిగా ఉన్న పశువులను గౌరవించడం మన దేశ సంస్కృతి గొప్పదనమని కొనియాడారు.