ముంబయిపై రాజస్థాన్‌ విజయం‌..

219
RR beat MI by seven wickets
- Advertisement -

ఐపీఎల్‌-11 ప్లేఆఫ్‌ రేసు రసవత్తరంగా మారింది. వారం కిందటి వరకు పట్టికలో అట్టడుగున నిలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌.. ఇప్పుడు ప్లేఆఫ్‌కు గట్టి పోటీదారుగా మారింది. ఆదివారం ముంబయిని 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. మొదట ముంబయి 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఎవిన్‌ లూయిస్‌ (60; 42 బంతుల్లో 4×4, 4×6) టాప్‌స్కోరర్‌. 10 ఓవర్లలో 86/6తో నిలిచిన ముంబయికి రెండో అర్ధంలో రాయల్స్‌ పేసర్లు ఆర్చర్‌ (2/16), స్టోక్స్‌ (2/26) కళ్లెం వేశారు.

అనంతరం బట్లర్‌ (94 నాటౌట్‌; 53 బంతుల్లో 9×4, 5×6) జోరులో 18 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పరిస్థితులకు తగ్గట్లు కొలిచినట్లు ఆడిన బట్లర్‌.. ఇన్నింగ్స్‌కు మూల స్తంభంలా నిలిచాడు. సంయమనం ప్రదర్శిస్తూనే.. అప్పుడప్పుడూ కళ్లు చెదిరే షాట్లు ఆడాడు. షార్ట్‌ (4) తొలి ఓవర్లోనే వెనుదిరిగినా.. రహానె (37; 36 బంతుల్లో 4×4)తో కలిసి రెండో వికెట్‌కు శతక భాగస్వామ్యం (95) నెలకొల్పడంతో రాయల్స్‌ పని తేలికైపోయింది. తర్వాత వచ్చిన శాంసన్‌ (26; 14 బంతుల్లో 2×4, 2×6) మెరుపు షాట్లతో ముంబయికి అవకాశమే లేకుండా చేశాడు. 18వ ఓవర్‌ చివరి బంతికి బట్లర్‌ సిక్సర్‌తో పని పూర్తి చేశాడు.

RR beat MI by seven wickets

ముంబై: సూర్యకుమార్‌ (సి) ఉనాద్కట్‌ (బి) ఆర్చర్‌ 38, లూయీస్‌ (సి) శాంసన్‌ (బి) కులకర్ణి 60, రోహిత్‌ (సి) ఉనాద్కట్‌ (బి) ఆర్చర్‌ 0, ఇషాన్‌ (సి) శాంసన్‌ (బి) స్టోక్స్‌ 12, హార్దిక్‌ (సి) శాంసన్‌ (బి) స్టోక్స్‌ 36, క్రునాల్‌ (సి) గౌతమ్‌ (బి) ఉనాద్కట్‌ 3, కటింగ్‌ (నాటౌట్‌) 10, డుమిని (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో168/6.

వికెట్ల పతనం: 1-87, 2-87, 3-108, 4-119, 5-131, 6-166.

బౌలింగ్‌:గౌతమ్‌ 2-0-23-0, కులకర్ణి 4-0-43-1, ఆర్చర్‌ 4-0-16-2, స్టోక్స్‌ 4-0-26-2, గోపాల్‌ 2-0-21-0, ఉనాద్కట్‌ 4-0-37-1.

రాజస్థాన్‌: షార్ట్‌ (సి) ఇషాన్‌ (బి) బుమ్రా 4, బట్లర్‌(నాటౌట్‌) 94, రహానె (సి) సూర్యకుమార్‌ (బి) హార్దిక్‌ 37, శాంసన్‌ (సి) చాహర్‌ (బి) హార్దిక్‌ 26, స్టోక్స్‌(నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు 10, మొత్తం: 18 ఓవర్లలో 171/3.

వికెట్ల పతనం: 1-9, 2-104, 3-165.

బౌలింగ్‌: బుమ్రా 3-0-34-1, మెక్లెనగన్‌ 4-0-28-0, క్రునాల్‌ 4-0-24-0, హార్దిక్‌ 4-0-52-2, మార్కండే 3-0-32-0,

- Advertisement -