‘బంగార్రాజు’గా నాగ్ రెడీ ..

570
Nagarjuna announces sequel to Soggade Chinni Nayana..?
- Advertisement -

నాగార్జున హీరోగా ద్విపాత్రాభినయంతో వచ్చిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘బంగార్రాజు’ పాత్రలో పంచె కట్టుతో ప్రేక్షకులను ఓ రేంజులో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో ఆయన సరసన లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ, యాంకర్ అనసూయ మధ్య సాగిన కెమిస్ట్రీ సినిమాకు హైలెట్‌గా నిలిచింది.

Nagarjuna announces sequel to Soggade Chinni Nayana..?

ఈ చిత్రం నాగార్జున కెరియర్‌లో పెద్ద విజయం సాధించటంతో ‘బంగార్రాజు’ పేరుతో దీనికి సీక్వెల్‌గా తీసే పనిలో ఉన్నాడట ఈ సినిమా దర్శకుడు కల్యాణ్ కృష్ణ. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ప్రారంభించినట్లు సమాచారం. ‘సోగ్గాడే చిన్నినాయానా’ సినిమాలో ఉన్న వినోదం, సెంట్‌మెంట్ అంశాలతో ఈ సినిమా రూపొందించనున్నారట చిత్ర యూనిట్.

ప్రస్తుతం కల్యాణ్ కృష్ణ రవితేజ హీరోగా ‘నేల టిక్కెట్’ చిత్రాన్ని పూర్తి చేశాడు. నాగార్జున ఆఫీసర్ చిత్రం కూడా విడుదలకు సిద్దమవటంతో నాగ్ నెక్ష్ట్ సినిమా ఎవరితోనూ సైన్‌ చేయకపోవడంతో ‘బంగార్రాజు’ సినిమా చేయటానికి మొగ్గుచూపుతున్నట్లు  తెలుస్తోంది. ఇక ఈ ఇద్దరి సినిమాలు విడులైన తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్లు సమాచారం. మరీ ‘సొగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

- Advertisement -