టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై..

33
MI vs RR

ఐపీఎల్ 14వ సీజన్ భాగంగా గురువారం మరో ఆసక్తిరమైన మ్యాచ్‌ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ పోటీ పడుతోంది. ముందుగా ముంబై జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ముంబై జట్టులో ఇషాన్ కిషన్‌ను తప్పించి, నాథన్ కౌల్టర్ నైల్‌ను తీసుకున్నారు.

పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ ఏడో స్థానంలో ఉంది. టోర్నీలో ముంబై జట్టు ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు సాధించగా, రాజస్థాన్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అయితే ముంబై ఇండియన్స్ రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉండడంతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ కంటే ముందు నిలిచింది.

ఐపీఎల్‌లో ముంబై, రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో చెరో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. మిగిలిన ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

తుది జట్లు :

Rajasthan Royals (Playing XI): Jos Buttler, Yashasvi Jaiswal, Sanju Samson(w/c), Shivam Dube, David Miller, Rahul Tewatia, Riyan Parag, Chris Morris, Jaydev Unadkat, Chetan Sakariya, Mustafizur Rahman

Mumbai Indians (Playing XI): Quinton de Kock(w), Rohit Sharma(c), Suryakumar Yadav, Hardik Pandya, Kieron Pollard, Krunal Pandya, Nathan Coulter-Nile, Jayant Yadav, Rahul Chahar, Jasprit Bumrah, Trent Boult