ఐపీఎల్‌లో రాజస్థాన్ బోణీ…

225
Royals won by 10 runs against Delhi
- Advertisement -

ఐపీఎల్‌ – 11లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడటంతో రాజస్థాన్ గెలుపు సునాయసమైంది. ఢిల్లీ 6 ఓవర్లలో 71 పరుగులు చేయాల్సి ఉండగా 4 వికెట్లు కొల్పోయి 60 పరుగులు మాత్రమే చేసింది. తొలి బంతికే మున్రో రనౌట్ కాగా.. రెండు ఓవర్లలో ఢిల్లీ జట్టు 15 పరుగులు మాత్రమే చేయగలిగింది. కానీ జయదేవ్ ఉనద్కత్ విసిరిన మూడో ఓవర్లో మ్యాక్స్‌వెల్ 14 పరుగులు పిండుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న మ్యాక్స్‌వెల్‌ను తర్వాతి ఓవర్లో లాంగ్లిన్ పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ రాజస్థాన్ వైపు మొగ్గింది.

అంతకముందు టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే రాజస్థాన్‌కు ఆశించిన ఆరంభమేమీ దక్కలేదు. ఓపెనర్‌ షార్ట్‌ (6) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ రనౌటై వెనుదిరిగాడు. మూడో స్థానంలో వచ్చిన బెన్‌ స్టోక్స్‌ (16; 12 బంతుల్లో 1×4, 1×6) ఇన్నింగ్స్‌ను చక్కగానే ఆరంభించినప్పటికీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. దశలో కెప్టెన్‌ రహానె (45; 40 బంతుల్లో 5×4), వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్‌ (37; 22 బంతుల్లో 2×4, 2×6) కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

తర్వాత బట్లర్‌ (29; 18 బంతుల్లో 2×4, 2×6) ధాటిగా ఆడటంతో స్కోరు 150 దాటింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో 17.5 ఓవర్లలో రాజస్థాన్ 5 వికెట్లు కొల్పోయి 153 పరుగులు చేసింది. సంజు సామ్ సన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌.. సన్‌రైజర్స్‌ చేతిలో, దిల్లీఢిల్లీ.. పంజాబ్‌ చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

- Advertisement -