‘జబర్దస్త్’ పాలిటిక్స్‌తో ‘రచ్చబండ’ పైన రోజా..!

250
- Advertisement -

నటి, ఎమ్మెల్యే రోజాపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిస్తోంది. ఎప్పుడూ జబర్దస్త్ షోలో కనిపించే రోజా గత శుక్రవారం ఆ షోకి రాలేదు. గతంలో చాలా సార్లు రోజా షోకి డుమ్మా కొట్టినా.. అప్పుడు వేరే కారణాలున్నాయి. ఈ మధ్య రోజా ఓ ఛానల్లో రచ్చబండ పేరుతో ఓ రియాలిటీ షో చేస్తోంది. ఆ షో ఇటీవల వివాదస్పదంగా మారింది.

రేటింగుల కోసమే అయినా..షోలో రోజా ప్రవర్తనపై విమర్శలు వెల్తువెత్తున్నాయి. ఈ నేపధ్యంలోనే రోజాపై రాజకీయంగా ఒత్తిళ్లు వస్తున్నాయని తెలుస్తోంది. అందుకే ఆమె తాజాగా జబర్దస్త్ షోకి రాలేదని సమాచారం. గతంలో రెండు మూడు సార్లు రోజా జబర్దస్త్ షోకి హాజరుకాలేదు.అయితే అందుకు అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్యేగా సొంత నియోజకవర్గంలో పనులు చూసుకోవడం వంటి కారణాలున్నాయి. ఆ సందర్బాల్లో జబర్దస్త్ షో నిర్వహకులు సెలబ్రెటీలతో రోజా ప్లేస్ ను భర్తీ చేశారు.

తాజాగా రోజా ఈ షోకి రాకపోవడంతో నాగబాబు ఒక్కడే జడ్జ్ గా వ్యవహరించాడు. రోజా రాకపోవడంపై యాంకర్ రష్మీ షో మధ్యలో బాబును ఆరా తీయగా… దీంతో షో కూడా కాస్త కళ తప్పిందని అక్కడున్న వారంతా అనుకున్నట్లు గుసగుసలు వినిస్తున్నాయి. రోజా జబర్దస్త్ షోకు రాకపోవడం వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని నాగబాబుది. నాగబాబును ఆరా తీయగా.. అందుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమని చెప్పాడు. మధ్య అసెంబ్లీలో రోజా ప్రవర్తన కారణంగా స్పీకర్ ఆమెను సభనుంచి బహిష్కరించారు. వైసీపీ అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసినా.. రోజా ప్రవర్తనను కూడా కాస్త సీరియస్ గానే తీసుకుందని వార్తలు వినిపించాయి.

ఈ నేపధ్యంలో రోజా హోస్ట్ గా చేస్తున్న రచ్చబండ ప్రోగ్రామ్ పై వస్తున్న విమర్శలను ఆ పార్టీ సీరియస్‌ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.పార్టీపై దీని ప్రభావం ఉండకూడదనే ముందుస్తుగానే రాజకీయంగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఆ కారణంగానే రోజా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.అయితే జబర్దస్త్ షోకి రాకపోవడం.. రాజకీయ ఒత్తిళ్లకు లింకేంటన్నది అర్ధం కావడంలేదు. తరువాత వారం ఆమె షోకి హాజరైతే.. ఈ వార్తలన్నింటికి పులిస్టాప్ పడుతుంది. అయితే ఏది ఎలా ఉన్నా.. జరుగుతున్న పరిణామాలన్నీ రోజాకు పెద్ద షాకేనని చెప్పొచ్చు. మరీ దీనిపై ఆమె నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుంటుందో చూడాలి.

- Advertisement -