నాగబాబు పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్

35
- Advertisement -

మెగా బ్రదర్ గా తప్ప, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుకు నోచుకోని నాగబాబు పై తాజాగా ఎన్టీఆర్ అండ్ ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. దీనికి కారణం.. నిన్న చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ వేడుకలో నాగబాబు మాట్లాడిన విధానం ఆర్ఆర్ఆర్ టీమ్ తో పాటు ఎన్టీఆర్ అభిమానులకు కూడా అస్సలు నచ్చడం లేదు. ఇంతకీ నాగబాబు ఏం మాట్లాడాడు అంటే.. రామ్ చరణ్‌ స్థాయి ఇప్పుడు ఏ హీరో అందుకోలేదు. అదే నాకు రామ్ చరణ్‌లో నచ్చిన విషయం. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ మేజర్ పార్ట్ అవ్వడం, ఆస్కార్ వరకు వెళ్లడం, ముఖ్యంగా చరణ్ డ్యాన్స్ తో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం, ఆ స్టేజ్ మీద రామ్ చరణ్‌ బొమ్మ కనిపించడం మనందరికీ ఎంతో గర్వంగా అనిపిస్తుంది అంటూ నాగబాబు మాట్లాడాడు.

ఇదే ఎన్టీఆర్ అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. డైరెక్ట్ గా నాగబాబుకే మెసేజ్ లు చేస్తూ రెచ్చిపోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్ స్టేజ్ మీద రామ్ చరణ్‌ బొమ్మ కనిపించిందా ? లేక, ఎన్టీఆర్ బొమ్మ కనిపించిందా ? మిస్టర్ నాగబాబు గారు ?, ఇంకా ఏమిటి అన్నారు ?, రామ్ చరణ్‌ స్థాయి ఏ హీరో అందుకోలేడా ?. రాజమౌళి లేకపోతే అసలు చరణ్ కి ఒక స్థాయి వచ్చేదా ?, అన్నట్టు చరణ్ కంటే ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ ముందు వరుసలో లేరు అనుకుంటున్నారా ? ఏమిటి ?. వారి స్థాయి చరణ్ స్థాయి కంటే ఎక్కువ.

నాగబాబు గారు మీకు తెలియదేమో.. చరణ్ డ్యాన్స్ తో నాటు నాటు పాటకు ఆస్కార్ రాలేదు. ఆస్కార్ వచ్చింది, సాహిత్యానికి, సంగీతానికి. అసలు మీరు ఇలా మాట్లాడటం బాగాలేదు నాగబాబు గారు. రామ్ చరణ్‌ ఒక మెచ్యూర్డ్ పర్సన్‌ గా ఉంటాడు. దయచేసి మీ వల్ల.. చరణ్ స్థాయిని తగ్గించకండి’ అంటూ ఎన్టీఆర్ అభిమానులు నాగబాబుకి రిక్వెస్ట్ గా మెసేజ్ లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి…

ఎన్టీఆర్ నటనకు బ్రహ్మరథం!

Nidhi Agarwal:రాజశ్యామల యాగం

#BoyapatiRAPO:అక్టోబర్ 20న రిలీజ్

- Advertisement -