రోహిత్ ‘విధ్వంసం’.. మజా ఆగయా!

13
- Advertisement -

టీమిండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ మద్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో రోహిత్ వీరంగం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి తన బ్యాటింగ్ లో పస తగ్గలేదని మరోసారి నిరూపించాడు. పీకల్లోతు టీమిండియాను ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించి అసలైన హిట్ మ్యాన్ గా నిలిచాడు. రోహిత్ విధ్వంసానికి చిన్నస్వామి స్టేడియంలో ఊచకోత అనే పదానికి మరో పర్యాయ పదంలా నిలిచాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన వేళ రోహిత్ శర్మ తన బ్యాట్ కు పని చెప్పాడు. యశస్వి జైస్వాల్ (4), విరాట్ కోహ్లీ (0), శివం దూబే (1), సంజూ సాంసన్ (0), వెనువెంటనే పెవిలియన్ చేరినప్పటికి మొదటి నుంచి క్రీజ్ లో ఉన్న రోహిత్ శర్మ, రింకూ సింగ్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు.

ఓ వైపు వికెట్లు పడినప్పటికీ తన దూకుడైన అతను ఏ మాత్రం తగ్గించకుండా భారీ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. రోహిత్ శర్మ (121), రింకూ సింగ్ (69), కదం తొక్కడంతో అఫ్గానిస్తాన్ ముందు లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య చేధనలో అఫ్గానిస్తాన్ కూడా ఏ మాత్రం తడబడకుండా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసి ఔరా అనిపించింది. స్కోర్ సమం కావడంతో సూపర్ ఓవర్ కు దారి తీసింది. సూపర్ ఓవర్ లో కూడా ఇరు జట్లు 16 పరుగులు చేయడంతో రెండో సూపర్ ఓవర్ కు దారి తీసింది. రెండో సూపర్ ఓవర్ లో ఇండియా 11 పరుగులు చేయగా, అఫ్గాన్ జట్టు కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయడంతో మ్యాచ్ టీమిండియా సొంతమైంది.

రోహిత్ రికార్డులు
ఆఫ్ఘనిస్తాన్ పై చెలరేగి ఆడిన రోహిత్ తన ఫిట్ నెస్ పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి రెండు జట్ల ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకు క్రీజ్ లోనే ఉన్న ఆటగాడిగా నిలిచాడు. ఇంకా ఈ విధ్వంసకర సెంచరీతో టీ20 లలో ఐదు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.

Also Read:TTD:ఏప్రిల్ శ్రీవారి దర్శన టికెట్ల కోటా రిలీజ్

- Advertisement -