World Cup 2023:పసికూనపై పంజా!

31
- Advertisement -

వరల్డ్ కప్ లో భాగంగా భారత్ మరియు అఫ్గానిస్తాన్ మద్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. అఫ్గానిస్తాన్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 35 ఓవర్లలోనే ఛేదించింది టీమిండియా. దీంతో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 272 పరుగుల గౌరవ ప్రధమైన స్కోర్ చేసింది. ఆ తరువాత లక్ష్య చేధనలో బరిలోకి దిగిన టీమిండియా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరగడంతో లక్ష్యచేధన సులువైంది. ప్రారంభం నుంచి ధాటిగానే స్టార్ట్ చేసిన హిట్ మ్యాన్ 84 బంతుల్లో 131 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. .

ఇందులో 16 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. చాలా రోజుల తరువాత రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటివరకు జరిగిన వన్డే వరల్డ్ కప్పులలో ఎనిమిది సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డ్ నెలకొల్పాడు. ఆ తరువాత ఇషన్ కిషన్ 47 బంతుల్లో 47 పరుగులు, విరాట్ కోహ్లీ 56 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టు విషయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ నెల 14 న పాకిస్తాన్ తో మ్యాచ్ ఉండగా.. ఆ మ్యాచ్ కు ముందు అఫ్గానిస్తాన్ పై భారీ విజయాన్ని నమోదు చేయడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచే అవకాశం ఉంది. అయితే మొదటి రెండు మ్యాచ్ లకు దూరమైన స్టార్ ఓపెనర్ శుబ్ మన్ గిల్.. పాక్ తో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది సందేహమే. మరి నెక్స్ట్ జరగబోయే పాక్ మ్యాచ్ పై టీమిండియా ఇదే ఫామ్ కొనసాగిస్తుందో లేదో చూడాలి.

Also Read:బెండకాయ సర్వ రోగనివారిణి..!

- Advertisement -