యథార్థ కథతో వస్తున్న అంజలి,రాయ్ లక్ష్మీ!

240
RK Studios Banner New Film With Anjali, Raai Lakshmi
- Advertisement -

గుంటూరు టాకీస్, రాజా మీరు కేక వంటి వినోదాత్మ‌క చిత్రాల‌ను  తెర‌కెక్కించిన ఆర్‌కె స్టూడియోస్ బ్యానర్ పై మరో చిత్రం రాబోతుంది. య‌దార్థ సంఘ‌ట‌నల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఎమ్. రాజ్‌కుమార్  నిర్మాత‌గా వ్యవహరిస్తుండగా  నంది అవార్డు గ్ర‌హీత క‌ర్రి బాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కనుంది.

గీతాంజ‌లి, చిత్రాంగ‌ద వంటి చిత్రాల‌తో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అంజ‌లి, కాంచ‌న సినిమాతో మాంచి ఫేమ్ సంపాదించిన రాయ్ ల‌క్ష్మి ముఖ్య పాత్ర‌ల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.వినూత్న‌మైన సోష‌ల్ ఎలిమెంట్స్ తో  కథతో పాటు కామెడీ,ఉత్కంఠ‌భ‌రిత‌మైన క‌థ‌నంతో ఈ చిత్రం ఉండ‌బోతుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలిపారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతన్నాయని తెలిపారు.

 RK Studios Banner New Film With Anjali, Raai Lakshmi
అంజ‌లి, రాయ్ ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రంలో సాయి కుమార్, న‌రేష్, శివ‌ప్ర‌సాద్, ధ‌న్‌రాజ్, జాకీ, అశోక్ కుమార్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.  ఈ చిత్రానికి, సంగీతం : మ‌ణిశ‌ర్మ‌,సినిమాటోగ్ర‌ఫీః పి.జి విందా,ఎడిటింగ్ః త‌మ్మిరాజు,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ద‌త్తి సురేష్ కుమార్,ప్రొడ్యూస‌ర్ః ఎమ్. రాజ్‌కుమార్,క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: క‌ర్రి బాలాజీ

- Advertisement -