ఆర్జే శ్వేత దర్శకత్వంలో అమ్మ

19
- Advertisement -

నిర్మాత యష్ రంగినేని సారథ్యంలో పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, అన్నపూర్ణ ఫొటో స్టూడియో వంటి సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.7 గా అమ్మ మూవీని నిర్మిస్తోంది. ఈ రోజు మదర్స్ డే సందర్భంగా అమ్మ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ చిత్రంతో ఆర్జే శ్వేత పీవీఎస్ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా తెరకెక్కనుంది.

అమ్మ మూవీ అనౌన్స్ మెంట్ సందర్భంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అమ్మ ఫొటో బ్యాక్ డ్రాప్ లో అగ్ని జ్వాలల మధ్య పంజరం, పక్షి ఫొటోతో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. మదర్ సెంటిమెంట్ తో సరికొత్త ఎమోషనల్ థ్రిల్లర్ మూవీగా అమ్మ సినిమా ఉండనుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Also Read:15న…సత్యభామ రిలీజ్

- Advertisement -