నాలుగేళ్ల కొకసారి జరిగే వరల్డ్ కప్ గురించి ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. వచ్చే నెల 30న ఈమెగా టోర్ని ప్రారంభంకానుంది. ఇప్పటికే పలు టీంలు తమ జట్లను ప్రకటించాయి. ఇటివలే ఇండియా కూడా
15 మంది జట్టు సభ్యుల వివరాలను బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈప్రపంచకప్ లో అంబటి రాయుడు, రిషబ్ పంత్ లకు చోటు దక్కకపోవడంతో వారిద్దరూ సెలక్టర్లపై గుర్రుగా ఉన్నారు. ఇక అంబిటి రాయుడు అయితే సెలక్టర్లపై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నాడు. అంబటి రాయుడికి జరిగిన అన్యాయంపై సెలక్టర్లను ప్రశ్నించారు గౌతమ్ గంభీర్.
అయితే ఇప్పడు వీరిద్దరికి ఊరట నిచ్చే వార్త చెప్పింది బీసీసీఐ. వీరిద్దరిని ప్రపంచకప్ కు స్టాండ్ బై ఆటగాళ్లుగా ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో ఎవరికైనా గాయం తగిలితే వీళ్లను తీసుకోనున్నారు. మరో యువ ఆటగాడు బెంగుళూరు తరపున ఆడుతున్న పేసర్ నవదీప్ ను కూడా స్టాండ్ బై ఆటగాడిగా చేర్చారు. ఇప్పటికే సెలక్టర్లపై గుర్రుగా అంబటి రాయుడు స్టాండ్ గా అవకాశం ఇవ్వడంతో ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి.