“మజిలీ” జంటతో ఆర్ఎక్స్ 100 దర్శకుడు

221
ajay bhupathi chai sam

అక్కినేని నాగచైతన్య సమంత జంటగా నటిచంచిన చిత్రం మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈచిత్రం ఘన విజయాన్ని సాధించింది. అంతేకాకుండా బాక్సాఫిస్ వద్ద సైలెన్స్ గా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాగచైతన్య కెరీర్ లోనే ఈసినిమా పెద్ద హిట్ గా చెప్పుకోవచ్చు.. ఇక ఈమూవీలో నాగచైతన్య , సమంత ల యాక్టింగ్ అదిరిపోయిందంటున్నారు ప్రేక్షకులు. తాజాగా ఉన్న సమచారం ప్రకారం వీరిద్దరూ కలిసి మరోసారి ఒకే మూవీలో నటించనున్నారని తెలుస్తుంది.

ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో బంపర్ హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి ఇటివలే నాగ చైతన్యకు కథ వినిపించాడట. చైతూకి కథ నచ్చడంతో పూర్తి కథను సిద్దం చేయమని చెప్పాడట. అయితే ఈసినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకుందామని నాగచైతన్యకు చెప్పాడట దర్శకుడు అజయ్ భూపతి. సమంతకు కూడా ఈకథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. చై సామ్ ఇప్పటికే 4సినిమాల్లో కలిసి నటించారు.

తాజాగా మరో మూవీలో కలిసి నటించడంతో అక్కినేని అభిమానులు హ్యాపిగా ఫీలవుతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య వెంకీ మామ మూవీలో బిజీగా ఉన్నాడు. ఆతర్వాత నాగార్జున బంగార్రాజు మూవీలో నటించనున్నాడు. ఈరెండు సినిమాల తర్వాత అజయ్ భూపతితో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. ఆర్ఎక్స్ 100మూవీలో ముద్దులతో ముంచెత్తిన ఈదర్శకుడు ఈసినిమాలో ఏవిధంగా తీస్తాడో చూడాలి మరి.