వర్మ చెప్పినంతా పనిచేశాడు. వర్మ…..జీఎస్టీ పోర్న్ మూవీ అంటూ విమర్శలు వచ్చినా,మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేసినా వెనక్కి తగ్గలేదు. శుక్రవారం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌ని విడుదల చేయడం,పోర్న్ స్టార్ మియా మాల్కోవా అందాలను వీక్షించేందుకు నెటిజన్లు ఎగబడటంతో సైట్ క్రాష్ అయింది. నెటిజన్లు నిరాశ చెందొద్దని వర్మ ట్వీట్ చేసిన వర్మ ఇవాళ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తానని ప్రకటించి…సరిగ్గా అదే టైంకు ఈ వెబ్ సిరీస్‌ని ఆన్ లైన్లో విడుదల చేశారు.
వర్మ..జీఎస్టీ ఆదరణకు నిర్మాతలు అవాక్కయ్యారు. అంతకు ముందు జీఎస్టీని ఉద్దేశించి ట్వీట్ చేసిన వర్మ.. దీపికా పదుకొనే కంటే ఎక్కువ మంది మియా మాల్కోవానే చూసేందుకు ఎగబడుతున్నారంటూ గూగుల్ ట్రెండ్స్‌ను బయటపెట్టాడు.
మరోవైపు వర్మ, రచయిత జయకుమార్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాంగోపాల్ వర్మ తన జీఎస్టీ కధను దొంగిలించాడని జయకుమార్ ఆరోపించగా, తన ఆఫీసులో జయకుమార్ చాలా సార్లు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడని వర్మ ప్రత్యారోపణ చేశాడు. దీంతో జయకుమార్ మరింత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయనను హాలీవుడ్ లో అనేక మంది తారల జీవితాలతో ఆడుకున్న హార్వే వీన్ స్టీన్ తో పోల్చాడు. వర్మలోని స్వలింగసంపర్క స్వభావాన్ని బయటపెట్టాలనుకోవడం లేదని, కానీ ఆయన లైంగిక వేధింపులను వ్యతిరేకించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.