ఫుల్ బాటిలే నైవేధ్యం….ఎక్కడో తెలుసా!

259
ramanatha temple
- Advertisement -

భారత దేశం విభిన్నమతాలకు పుట్టినిల్లు. ఒక్కో రాష్ట్రం,ఒక్కో ప్రాంతం,ఒక్కో గ్రామం ఒక్కో ఆచారం. ఎన్నిమతాలున్న,ఎన్ని కులాలున్న దేశం అంటే ఏకమవుతారు అందరూ. ఇక దేవుళ్లకు పూజ చేసే విధానం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది.

కొన్ని దేవాలయాలకు మాంసం,మందు తిని రాకూడదు. మరికొన్ని దేవాలయాలకు మందు,మాంసం తిని రావొచ్చు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు నివసించే జీవన విధానాన్ని భట్టి ఆయా సంస్కృతులు అందుబాటులోకి రాగా కర్ణాటకలోని ఓ ఆలయంలో మాత్రం దేవుడికి ఏకంగా మందు బాటిల్స్‌నే నైవేద్యంగా పెడతారట.

కర్ణాటకలోని రామనాధ్ స్వామి ఆలయం. ఇక్కడి ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు పూలు,పండ్లతో పాటు ఒక విస్కీ బాటిల్‌ని తీసుకొచ్చి ఆలయ పూజారులకు ఇవ్వగా వారు విస్కీనే ప్రసాదంగా ఇస్తారు. పూజ అనంతరం ఆ లిక్కర్ ప్రసాదం తాగితే ఎలాంటి సమస్యలు రావడం నమ్మకం. దీని వెనుక పెద్ద కారణమే ఉందని అక్కడి పూజారులు చెబుతున్నారు. పూర్వం స్వామివారు రాక్షసులను మట్టుపెట్టించాకా.. మద్యం తాగి సేద తీరారని, ఆ తర్వాతనే భక్తుల కోరికలను తీర్చేవారని, అందుకే అప్పటినుండి ఇక్కడ మద్యం బాటిల్స్ నే నైవేద్యంగా పెడుతున్నట్లు తెలిపారు.

- Advertisement -