షాకింగ్..ఆర్జీవీ నోట పాజిటివ్ కామెంట్స్!

24
rgv

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు ఆర్జీవీ నోట పాజిటివ్ కామెంట్స్ వినపడ్డాయి. కొంతకాలంగా ఏపీలో సినిమా టికెట్ రేట్లపై స్పందిస్తూ రచ్చ చేస్తున్న ఆర్జీవీ కాస్త రూట్ మార్చి అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీపై ప్రశంసలు గుప్పించాడు.

పుష్ప సినిమాతో ప్రాంతీయ సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు తెలిపారు. 83, యాంటీమ్, సత్యమేవ జయతే-2 వంటి పెద్ద బాలీవుడ్ చిత్రాలు ఉన్నప్పటికీ, ‘పుష్ప’కు దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం అద్భుతంగా ఉందని ఆర్జీవీ అన్నారు.