అల్లు అరవింద్‌ టార్గెట్‌గా ఆర్జీవీ ….’బావ రాజ్యం’!

212
alla aravind
- Advertisement -

కరోనా నేపథ్యంలో ఓటీటీ సినిమాలపై దృష్టిసారించిన ఆర్జీవీ కాంట్రవర్సీలకు మరింత కేరాఫ్‌గా మారాడు. ఇప్పటివరకు మెగా బ్రదర్ పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ పవర్ స్టార్ మూవీ తీసి రిలీజ్ చేసిన వర్మ తాజాగా మెగా ఫ్యామిలీకే సంబంధించిన మరో వ్యక్తి సినిమా తీయనున్నారు.

మెగా ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్‌ని టార్గెట్ చేస్తూ సినిమా తీయనున్నారని సమాచారం. ఈ మూవీకి బావ రాజ్యం అనే ఆసక్తికర టైటిల్‌ని ఖరారు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఇక అలాగే దర్శకధీరుడు రాజమౌళికి కరోనా సోకడంపై స్పందించారు ఆర్జీవీ. సర్.. మీ సైనికుడు బాహుబలిని పిలిచి కరోనాను ఓ తన్ను తన్నమనండి. జోక్స్ పక్కన పెడితే.. మీరు, మీ కుటుంబ సభ్యులు అతి త్వరలోనే దీని నుంచి కోలుకుంటార`ని వర్మ ట్వీట్ చేశారు.

- Advertisement -