రివ్యూ: శంభో శంకర

300
review Shambho Shankara
- Advertisement -

జబర్దస్త్ శంక‌ర్‌ హీరోగా శ్రీధ‌ర్ ఎన్. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శంభో శంకర. ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. టీజర్‌తోనే అంచాలను పెంచేసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది..?హీరోగా శంకర్ రాణించాడా లేదా చూద్దాం.

కథ:

ఊరిలో ప్రెసిడెంట్ చేసే అన్యాయాలపై తిరగబడతాడు శంకర్‌ (షకలక శంకర్‌ ). ప్రెసిడెంట్ చేసే అక్రమాలను బయటపెడతాడు. దీంతో ఆగ్రహించిన ప్రెసిడెంట్(అజయ్ ఘోష్‌) శంకర్‌కు ఎంతో ఇష్టమైన పోలీస్ ఉద్యోగం రాకుండా చేస్తాడు. అంతేగాదు ప్రెసిడెంట్ కుటుంబం వల్ల శంకర్ చెల్లెలు చనిపోతుంది. చెల్లెలి చావుకు ప్రతీకారాన్ని శంకర్ ఏ విధంగా తీర్చుకున్నాడు..?ప్రజల కష్టాలన్ని ఎలా తీర్చాడు అన్నదే శంభో శంకర కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ టైటిల్‌, శంకర్‌ డ్యాన్స్. ఇప్పటివరకు కామెడీయన్‌గా ఆకట్టుకున్న శంకర్‌ హీరోగా అలరించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా డ్యాన్సులతో అదరగొట్టాడు. తన ట్రేడ్ మార్క్ అయిన శ్రీకాకుళంలో యాసలో డైలాగ్‌లను ఇరగదీశాడు. హీరోయిన్ కారుణ్య చౌదరి, శంకర్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. విలన్‌గా అజయ్‌ ఘోష్‌ కాస్త భయపెట్టినా.. ఆ
తర్వాత అతని పాత్రలో సత్తువ లేకుండా పోయింది. మిగితా నటీనటులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.

shakalaka shanker

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ కామెడీ లేకపోవడం, కథ. పల్లెటూరు, ప్రెసిడెంట్‌ దౌర్జన్యాలు, రైతుల కష్టాలు ఎన్నో సినిమాలు వచ్చాయి. దీంతో రోటిన్‌గా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

లోబడ్జెట్‌తో తీసిన సినిమా కావడంతో సాంకేతిక హంగులపై పెద్దగా దృష్టిసారించలేదు. హీరో పాత్రను బాగానే డీజైన్ చేసిన కథ,కథనాన్ని ఆకట్టుకునేలా రాసుకోలేకపోయారు దర్శకుడు. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీత దర్శకుఉడ సాయి కార్తీక్ అందించిన పాటలు,బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

ఇప్పటివరకు కామెడీతో ఆకట్టుకుంటూ వస్తున్న షకలక శంకర్‌ హీరోగా చేసిన ప్రయత్నమే శంభో శంకర. సినిమా టైటిల్,శంకర్ డ్యాన్స్ సినిమాకు ప్లస్ పాయింట్ కాగా కథ,కథనం మైనస్ పాయింట్స్. పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంతో శంకర్ పర్వాలేదనిపించాడనే చెప్పాలి.

విడుదల తేదీ : 29/06/ 2018
రేటింగ్ : 2.25/5
నటీనటులు : శంకర్, కారుణ్య చౌదరి
నిర్మాతలు : వై.రమణా రెడ్డి, సురేష్ కొండేటి
సంగీతం : సాయి కార్తిక్
దర్శకత్వం : ఎన్. శ్రీధర్

- Advertisement -