టీఆర్ఎస్‌ను గెలిపించండి: కేసీఆర్‌

224
kcr gadwal tour
- Advertisement -

పాలమూరు పచ్చబడే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. జోగులాంబ గద్వాల జిల్లాలో గట్టు ఎత్తిపోథల పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన నడిగడ్డ ప్రగతిసభలో మాట్లాడిన సీఎం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం టీఆర్ఎస్ పార్టీకి యజ్ఞం లాంటిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు మహర్ధశ పట్టిందన్నారు. పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామని కూలీ పనులు చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పాలమూరుకు వలసలు రావాలన్నారు.

తెలంగాణలో ఇకపై కరెంట్ కోతలుండువని స్పష్టం చేశారు సీఎం. నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే అంధకారం వస్తుందని ప్రచారం చేశారని కానీ అవన్నీ నీటిమూటలేనని తేలిపోయిందన్నారు. ఇదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు సీఎం. ఎవరెన్ని కేసులు చేసినా ప్రాజెక్టులు కట్టి తీరుతామన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా  మార్చేవరకు విశ్రమించమని…వచ్చే ఎన్నికల్లో  టీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలన్నారు.

పట్టాదారు పుస్తకాల్లో రైతుల పేర్లే ఉంటాయని కౌలు రైతుల పేర్లు ఉండవని తెలిపారు సీఎం. రైతుకు రక్షణ ఉండాలన్నారు. చరిత్రలో ఏనాడూ రైతులకు ఏ ప్రభుత్వం ఆలోచన చేయని విధంగా రైతుబంధు పథకంతో ఎకరాకు రూ. 8వేల పెట్టుబడి,రైతు చనిపోతే రూ. 5 లక్షల ప్రమాద భీమా అందిస్తున్నామని చెప్పారు.

రైతులు లాభాలబాటలో పయనించే వరకు నిద్రపోనని ప్రభుత్వం తరపున రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. విత్తనాలు,ఎరువుల కొరతలు లేకుండా చూశామని తెలిపారు సీఎం. రాబోయే రోజుల్లో గ్రామ గొడౌన్‌ పేరుతో పథకాన్నితీసుకురాబోతున్నామని తెలిపారు.

రైతులకు లాభాలు రావాలంటే మార్కెట్‌లో డిమాండ్ ఉండే పంట వేయాలన్నారు. సమస్యలన్నింటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. రైతుసమస్వయ సమితి,రైతు విస్తరణ అధికారుల నాయకత్వంలో రైతలకు స్వర్ణయుగం రాబోతుందన్నారు.

భారతదేశ రైతులకు తెలంగాణ రైతులు దిక్సూచిగా నిలవాలన్నారు. 31 జిల్లాలతో ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చామన్నారు. కేసీఆర్‌ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. కల్యాణలక్ష్మీ,షాది ముబారక్‌తో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు సాయం చేస్తున్నామని వెల్లడించారు. హోంగార్డు,ఆశా వర్కర్లు,అంగన్‌వాడీ వర్కర్లకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జీతాలు ఇస్తున్నామని చెప్పారు.

జోగులాంబ గద్వాల జిల్లాకు వరాల జల్లు…

()గద్వాల ప్రభుత్వ హాస్పిటల్‌ని 300 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్
() గద్వాల అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు మంజూరు
()గద్వాలకు ఎస్సీ,ఎస్టీ స్టడీ సర్కిల్
() గట్టు ఎత్తిపోథల పథకానికి నల్ల సోమనాద్రి గట్టు ఎత్తిపోథల పథకంగా పేరు మార్పు
() గట్టులో రెసిడెన్షియల్ స్కూల్
()కేడిదొడ్డి మండల కేంద్రంలో గిరిజన గురుకుల పాఠశాల మంజూరు
()గుర్రం గడ్డ బ్రిడ్జి కోసం రూ. 10 కోట్లు మంజూరు
()గద్వాల బస్టాండ్‌కు రూ. 2కోట్లు
()జూరాల డ్యాం దగ్గర రూ. 15 కోట్లతో బృందావనం పార్క్‌

- Advertisement -