టీఆర్ఎస్‌లో చేరిన ఆర్యవైశ్యులు..

215
ktr telangaan bhavan
- Advertisement -

దేశాన్ని,రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో జంటనగరాలకు చెందిన ఆర్య,వైశ్యులు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటిదామోదర్ గుప్త ఆధ్వర్యంలో మంత్రులు నాయిని,కేటీఆర్,తలసాని సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ అగ్రకులాల్లోనూ పేదలు చాలామంది ఉన్నారని తెలిపారు. అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు అన్ని విధాల అన్యాయం జరిగిందని తెలిపారు. ఏ పనిచేసిన సీఎం చిత్తశుద్దితో చేస్తారని తెలిపారు. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

అన్నివనరులున్నా దేశం అభివృద్ధిలో వెనుకంజలో ఉండటానికి కారణం కాంగ్రెస్‌ పార్టీ అని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన ద్రోహం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అన్నారు. కాంగ్రెస్ పుణ్యమాని 70 ఏళ్లయినా దేశంలో వేలాది గ్రామాలకు కరెంట్ లేదన్నారు. విధిలేని పరిస్ధితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్త, తీగల కృష్ణారెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -