రివ్యూ : లండన్ బాబులు

311
Review London Babulu
- Advertisement -

ర‌క్షిత్, స్వాతి రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న చిత్రం లండ‌న్ బాబులు . బి. చిన్ని కృష్ణ దర్శతక్వంలో మారుతి టాకీస్ బేన‌ర్ పై మారుతి ఈ మూవీని నిర్మిస్తున్నారు. త‌మిళ మూవీ ఆండ‌వ‌న్ క‌ట్టాలాయ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. టీజ‌ర్‌తో అంచనాలను పెంచేసిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ:

గాంధీ(రక్షిత్‌)కి కష్టాలే కష్టాలు.. అమ్మ చనిపోతుంది.. నాన్నకు పక్షవాతం.. అక్కను బావ వేధిస్తుంటాడు. బావకు రూ.6లక్షలు అప్పు చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ తీర్చడానికి లండన్‌ వెళ్లి డబ్బులు బాగా సంపాదించాలనుకుంటాడు.వీసా, పాస్‌పోర్ట్‌ కోసం బ్రోకర్‌ను కలుస్తాడు. పెళ్లైన వాళ్లకు వీసాలు త్వరగా వస్తాయనే ..పాస్‌పోర్ట్‌ అప్లికేషన్‌లో తనకు పెళ్లైందని, భార్య పేరు సూర్యకాంత అని రాస్తాడు. అలా రాయడం వల్ల అతనికి వచ్చిన ఇబ్బందులు ఏంటి? అసలు సూర్యకాంతం ఉందా? తర్వాత ఏం జరిగింది అనేదే సినిమా కథ.

Review London Babulu

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్   ఆసక్తికరమైన కథనం,కామెడీ,నటీనటులు.  తమిళ రిమేక్‌ సినిమాను తెలుగు నేటివిటికి అనుకూలంగా మలచడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. తొలి సినిమాతో హీరో రక్షిత్ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. స్వాతి అలవాటు ప్రకారం అల్లుకుపోయింది. కీలక సన్నివేశాల్లో స్వాతి తనదైన నటనతో ఆకట్టుకుంది.  ఎప్పుడు కామెడీతో ఆకట్టుకునే ధనరాజ్‌ ఈసారి కంటతడి పెట్టించాడు. సినిమాకు మరో బలం కామెడీ. అలీ,సురేఖవాణి,అజయ్‌ఘోష్,మురళీ శర్మ తమ పాత్రలో ఒదిగిపోయారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్. సెకండాఫ్‌ తడబడుతూ సాగుతుంది. సత్య లేని వెలితి కనిపిస్తుంది. పాస్‌పోర్ట్‌ సంపాదించడం ఎలా? కోర్టులో విడాకులు ఎలా ఇస్తారు? తదితర వ్యవహారాలను వాస్తవానికి దగ్గరగా చూపించారు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. మాటలు ఆకట్టుకుంటాయి. శ్యామ్‌ కె నాయుడు ఛాయ్రాగహణం.. ఉద్ధవ్‌ ఎడిటింగ్‌ బాగా చేశారు. ఓ తమిళ సినిమాను ఎక్కువ మార్పులు చేయకుండా తెలుగు నేపథ్యానికి సరిగ్గా సరిపోయేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు చిన్నికృష్ణ సఫలమయ్యారు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Review London Babulu

తీర్పు:

నేటి యువత ప్రేమకి, పెళ్లికి ఎంత తొందరపడుతున్నారో, అంత త్వరగా విడాకులు తీసుకునేందుకు ముందుంటున్నారు. అలాంటి ఓ జంట లండన్‌ ప్రయాణంలో జరిగిన సంఘటనల సమాహారమే ‘లండన్‌ బాబులు’. కామెడీ,నటీనటులు సినిమాకు ప్లస్ కాగా సెకండాఫ్‌ మైనస్‌. ఓవరాల్‌గా కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రం లండన్ బాబులు.

విడుదల తేదీ:17/11/2017
రేటింగ్:2.5 /5
నటీనటులు: రక్షిత్,స్వాతి.
సంగీతం: కె
నిర్మాత: మారుతి
దర్శకత్వం: బి.చిన్ని కృష్ణ

- Advertisement -