ఇక అలా డిపాజిట్‌ చేయడం కుదరదు….

276
- Advertisement -

రూ.500,1000 నోట్ల రద్దుతో నల్లకుబేరులకు వణుకు పుట్టింది. మోడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొన్ని రాజకీయపార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇన్నిరోజులు నల్లధనం దాచుకున్న వారు ఇప్పుడు ఏం చేయాలో తెలియక తర్జన బర్జన పడుతున్నారు. మరికొంత మంది ఇతరుల ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకుని ఆతర్వాత ఆ ఖాతాదారుడికి కొంత కమిషన్‌ ఇచ్చి వైట్‌ చేసుకుందాం అని అనుకుంటున్నారు. తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఈ ప్లాన్‌ బెడిసికొట్టింది.

reserve bank of india

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నల్ల కుబేరులు నల్ల ధనాన్ని తెలుపు చేసుకొనేందుకు ఇతరుల ఖాతాలను వినియోగించుకోవడంపై ఆర్బీఐ దృష్టి సారించింది. ఇతరుల ఖాతాలో పెద్ద ఎత్తున నగదు జమ చేసే సమయంలో ఎవరి ఖాతాలో నగదు జమ చేస్తున్నారో ఆ ఖాతాదారు నుంచి ఆథరైజేషన్‌ లెటర్‌ తీసుకురావాలన్న నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని బ్యాంకులను ఆదేశించింది ఆర్బీఐ.

reserve bank of india

ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో చదువుకుంటున్న పిల్లల ఖాతాల్లో వారి తల్లిదండ్రులు నగదు జమ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో బ్యాంకర్లు థర్డ్‌ పార్టీ జమలపై దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో నల్లధనాన్ని తెలుపు చేసుకొనేందుకు ఇతరుల ఖాతాలను నల్లకుబేరులు ఉపయోగించుకుంటున్నారని ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో ఆర్బీఐ మరోసారి బ్యాంకర్లను అప్రమత్తం చేసింది. దీంతో ఈ శనివారం నుంచి ‘క్యాష్‌ డిపాజిట్‌ యంత్రాలు(సీడీఎం)’ ద్వారా డిపాజిట్లు చేసేందుకు ఏటీఎం కార్డును తప్పనిసరి చేశారు. ఈ మేరకు సీడీఎంలలో ఆప్షన్లు మార్చేశారు.

reserve bank of india

ఖాతాదారులు తమ అకౌంట్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి, మెషిన్‌లో డబ్బు ఉంచగానే ఏటీఎం కార్డును ఇనసర్ట్‌ చేయాలనే మెసేజ్‌… స్కీన్‌ పై డిస్‌ప్లే అవుతోంది. నిజంగా వేసేది ఖాతాదారుడే అయితే తన దగ్గరున్న ఏటీఎం కార్డును అందులో పెట్టి లావాదేవీ పూర్తిచేసుకోవచ్చు. ఆథరైజేషన్‌ లెటర్‌ ఉంటేనే థర్డ్‌ పార్టీ జమలకు అనుమతిస్తున్నారు. ఆర్బీఐ తాజా నిబంధ‌న‌తో లావాదేవీలు గ‌ణ‌నీయంగా త‌గ్గిన‌ట్టు బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

- Advertisement -