మహేష్‌ ఎలా ఉంటాడో తెలిసేది ఆ రోజే..

222
Mahesh first look
Mahesh first look
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ నవంబర్ 24 నుండి అహ్మదాబాద్ లో జరగనుందని యూనిట్ తెలిపింది. వీటి తర్వాత పూణే, చెన్నైలలో కూడా కొన్ని షెడ్యూల్స్ ని జరుపుకోనుంది ఈ చిత్రం.

ఏజేంట్ శివ టైటిల్ తో ప్రచారం జరుగుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపింనుండగా , ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ జనవరితో పూర్తి చిత్రీకరణని పూర్తి చేసుకోనుందని, ఆ తర్వాత పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకొని వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో మూవీ రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ మూవీ లుక్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం జనవరి 26,2017న రిపబ్లిక్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట. ఇక అదే రోజు టైటిల్ ని కూడా ఎనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో మహేష్ బాబు ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా, ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్నాడు. రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

- Advertisement -