ఏటీఎం లేకుండా మనీ విత్ డ్రా..!

12
- Advertisement -

ప్రస్తుతం ఉన్న డిజిటల్ పేమెంట్స్ విధానంతో చేతిలో డబ్బు లేకుండానే కేవలం మొబైల్ ద్వారానే నగదు లావాదేవీలు జరుపుతూ అవసరమైన వస్తువులు కొనుకోవడం, ప్రయాణాలు చేయడం, ఆన్ లైన్ ద్వారానే ఇతరులకు డబ్బు పంపించడం.. వంటి ఎన్నో చేస్తున్నాం. అయితే అన్ని చోట్ల, అన్ని వేళల క్యాష్ లెస్ పెమెంట్స్ సాధ్యమేనా ? అంటే సాధ్యం కాదనే చెప్పాలి. కొన్ని సందర్భాల్లో చేతిలో డబ్బు ఉంటేనే పని జరుగుతుంది. అలాంటి సమయాల్లో వెంటనే మనీ కోసం ఏటీఎం సెంటర్స్ కు పరిగెత్తుతూ ఉంటాం. తీర అక్కడికి వెళ్ళిన తర్వాత ఏటీఎం కార్డు మర్చిపోతే ఇంకా ఆ టైమ్ లో వచ్చే టెన్షన్ వర్ణనాతీతం. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకే ఆర్బీఐ కొత్త ఫీచర్ ను ఏటీఎం మిషన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏటీఎం కార్డు లేకుండానే మనీ విత్ డ్రా తీసుకునే వీలు కల్పించింది. .

మనం డైలీ యూస్ చేసే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం,.. వంటి యాప్స్ ద్వారానే మనీ విత్ డ్రా తీసుకునే సౌకర్యం కల్పించింది. ఇలా ఏటీఎం కార్డు లేకుండా మనీ విత్ డ్రా తీసుకునేందుకు మీరు వెళ్ళిన ఏటీఎం సెంటర్స్ లో యూపీఐ విధానం ఉందో లేదో ముందే చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే కార్డు లేకుండా మనీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఏటీఎం మిషన్ లో యూపీఐ ఆప్షన్ కనిపిస్తే వెంటనే దానిపై క్లిక్ చేయాలి. ఆ తరువాత సంబంధిత యూపీఐ నెంబర్ ఎంటర్ చేసి మనీ రిక్వస్ట్ చేయాలి. వెంటనే పోన్ కు నోటిఫికేషన్ వస్తుంది. పోన్ లో యాక్సప్ట్ చేయగానే ఏటీఎం నుంచి నేరుగా మనీ విత్ డ్రా అవుతుంది. ఇలా యూపీఐ యాప్స్ ను ఉపయోగించి దగ్గర్లోని ఏటీఎం సెంటర్స్ లో మనీ కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఏటీఎం మిషన్ లో యూపీఐ ఆప్షన్, అలాగే మొబైల్ దగ్గర ఉండే చాలు. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ గా జరిగిపోతుంది.

Also Read:పిక్ టాక్ : నిండైన సొగసుతో కట్టిపడేస్తుంది

- Advertisement -