పిల్లల కోసం ప్రాణం ఇ(తీ)స్తా -రేణుదేశాయ్‌

332
Renu Desai,
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించారు. రేణు దేశాయ్ ఒక్కోసారి భావోద్వేగపూరితంగా కవితలు రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ వారి గురించి కూడా చెబుతుంటారు. తాజాగా ఆమె మరోసారి తన పిల్లలు అకీరా నందన్, ఆద్యతో కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేసి ఓ కవిత కూడా రాశారు.

Renu Desai,

అందులో.. ‘ఒక హృదయం, ఒక ఆత్మ.. మీ కోసం నేను ప్రాణాలు ఇస్తాను… మీ కోసం నేను ప్రాణాలు తీస్తాను.. తన పిల్లల కోసం ఓ తల్లి రాసిన అతి చిన్న కవిత.. నేను ఈ ఇద్దరి ఫొటోలను తీస్తూనే ఉంటాను’ అని రేణు దేశాయ్ తన పిల్లలు అకీరా, ఆద్యలను ఉద్దేశించి పేర్కొన్నారు.

ట్విట్టర్‌లో చురుగ్గా ఉండే రేణు ప్రతీ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇటీవల టీవీలో ప్రసారమైన ఓ రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఆమె గతంలో దర్శకురాలిగా ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను తెరకెక్కించారు. 2014లో విడుదలైన ఈ సినిమాలో అకీరా నందన్ కూడా నటించాడు. పవన్ కల్యాణ్ నటించిన పలు సినిమాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా, ఎడిటర్‌గా రేణు దేశాయ్ పనిచేశారు.

https://twitter.com/renuudesai/status/1001036959714701313

- Advertisement -