కామెర్ల వ్యాధికి చెక్ పెట్టండిలా!

19
- Advertisement -

నేటి చాలమంది కామెర్ల వ్యాధి బారిన పడుతూ ఉంటారు. దీనినే జాండీస్ అని కూడా అంటారు. రక్తంలో బైలిరుబిన్ అనే పదార్థం ఎక్కువ అవ్వడం వల్ల పచ్చ కామెర్ల వ్యాధికి దారి తీస్తుంది. ఇది పసుపురంగులో ఉండే ఒక వ్యర్థ పదార్థం. దీని పరిమాణం రక్తంలో ఎక్కువైనప్పుడు అది శరీరంలోని ఇతర కణజాలాల్లోకి చేరుకుంటుంది ఫలితంగా చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం వంటి సంకేతాలు కనిపిస్తాయి. ఇదే కామెర్ల వ్యాధికి ప్రధాన సూచిక. ఈ వ్యాధి బారిన పడిన వారిలో హటాత్తుగా జ్వరం, వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి, విపరీతమైన అలసట, చర్మంపై దురదలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా మలమూత్రలలో కూడా రంగు మార్పు కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే కామెర్ల వ్యాధిగా నిర్ధారించుకోవాలి. .

సరైన టైమ్ లో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకే కామెర్ల వ్యాధి పట్ల నిర్లక్ష్యం వహించరాదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధికి ఎక్కువ మంది నాటు వైద్యం తీసుకుంటూ ఉంటారు. ఇలా నాటు వైద్యం తీసుకోవడం చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సార్లు నాటు వైద్యం పని చేసినప్పటికీ అందరి శరీరాలకు ఆ నాటు వైద్యం పని చేయకపోవచ్చని తద్వారా వైద్యం వికటించి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో అధునాతన వైద్యం అందుబాటులో ఉంది. కాబట్టి జాండీస్ లక్షణాలు ఏ మాత్రం కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఎంతో మేలు. కామెర్ల వ్యాధి విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన కాలేయం దెబ్బతినే అవకాశాలు ఎక్కువట. లివర్ దెబ్బతింటే ఏమౌతుందో అందరికీ తెలిసిందే. కాబట్టి వీలైనంత వరకు జాండీస్ విషయంలో వైద్యుల సంరక్షణలో మెడిసిన్ తీసుకోవడమే మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట.

Also Read:World Cup 2023:సెంచరీ మిస్.. పాండ్యనే కారణమా!

- Advertisement -