Supreme Court: సుప్రీం కోర్టులో జగన్‌కు రిలీఫ్

0
- Advertisement -

వైసీపీ అధినేత జగన్‌కు సుప్రీం కోర్టులో రిలీఫ్ దక్కింది. జగన్ కేసుల ట్రయల్‌ బదిలీ కోరుతూ, బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై కూడా సుప్రీంకోర్టు లో ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని ధర్మాసనం పేర్కొనడంతో.. రఘురామ తరపు న్యాయవాది తమ పిటిషన్ ను వెనక్కు తీసుకున్నారు.

గతంలో సుప్రీంకోర్టు ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకు కూడా వర్తిస్తుంది. ట్రయల్ కోర్టు రోజువారీ విచారణకు తీసుకోవాలని, హైకోర్టు కూడా పర్యవేక్షణ చేయాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం తమ ఆదేశాల్లో పేర్కొంది. అందువల్ల మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

Also Read:రవితేజ.. ‘మాస్ జాతర’

- Advertisement -