సుప్రీంకోర్టు ఆదేశాలు.. బీఆర్ఎస్ పార్టీ విజయం

20
- Advertisement -

HCU భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి సర్కార్కు చెంపపెట్టు లాంటిది అన్నారు రెడ్కో మాజీ ఛైర్మన్ సతీష్ రెడ్డి.అది అటవీ ప్రాంతమే కాదని అందులో జంతువులు లేవని ఇన్ని రోజులు అందర్నీ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన సర్కారుకు దిమ్మదిరిగేలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇది ప్రకృతి ప్రేమికుల విజయం. ప్రతిపక్ష పార్టీగా, రాష్ట్రం మీద, రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడడం మీద ప్రేమ ఉన్న బీఆర్ఎస్ పార్టీ విజయం. విద్యార్థులపై, ప్రశ్నించిన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టి రాక్షసానందం పొందిన రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకోవాలి. చివరకు సొంత ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న స్మిత సభర్వాల్ లాంటి ఐఏఎస్ అధికారుల పైనా కేసులు పెట్టి నోటీసులు ఇవ్వడం దుర్మార్గం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా, తెలివితక్కువతనంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి ఇది నిదర్శనం అన్నారు.

సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత అయినా తన పద్ధతి మార్చుకొని ప్రతిపక్ష నాయకులపై పెట్టిన కేసులని ఎత్తివేసి హెచ్సీయూ విద్యార్థులకు, రాష్ట్ర ప్రజలకు, ప్రకృతి ప్రేమికులకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి. ప్రకృతిని చెరబట్టి బ్రోకర్లతో లాబీయింగ్ చేసి వేల కోట్లు తెచ్చుకుని వందల కోట్లు కమిషన్లు తీసుకుందామని చేసిన కుట్ర… సుప్రీంకోర్టు తీర్పుతో పటాపంచాలయ్యింది. రేవంత్ రెడ్డి ఇకనైనా తన బుద్ధి మార్చుకుంటే మంచిది. లేకపోతే ప్రజలే తరిమి కొడతారు. అలాగే సుప్రీంకోర్టుతో పదేపదే చీవాట్లు పెట్టించుకున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డుల్లోకి ఎక్కారు. వరుసగా మూడోసారి సుప్రీంకోర్టుతో తిట్లు తిన్నా ఆయన తీరు మారడం లేదు చట్టాన్ని, రాజ్యాంగ వ్యవస్థలపై ఆయనకున్న గౌరవం ఏ పాటిదో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోందని తెలిపారు.

Also Read:పర్యావరణ హననం..తప్పించుకోలేరు: కేటీఆర్

- Advertisement -