- Advertisement -
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఈడీ అరెస్ట్ చేసినా సీఎంగా కేజ్రీవాల్ ఇంకా పదవిలోనే ఉన్నారని, ఆయన్ని తొలగించాలని దాఖలైన పిల్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం..జైలు నుండి ప్రభుత్వాన్ని నడపకుండా చూడటానికి న్యాయపరంగా అవకాశాలు లేవని స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ ముఖ్యమంత్రిని తొలగించే అంశంపై జోక్యం చేసుకోలేదని తేల్చిచెప్పింది.
ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్…ఈడీ కస్టడీ నుండే పాలన చేస్తున్నారు. ఇప్పటివరకు రెండు ఆదేశాలు జారీ చేశారు. ఇక హైకోర్టు నిర్ణయంతో ఆప్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:IPL 2024 : హర్ధిక్ చెత్త కెప్టెన్సీ ?
- Advertisement -