IPL 2024 : హర్ధిక్ చెత్త కెప్టెన్సీ ?

44
- Advertisement -

ఐపీఎల్ 17 సీజన్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు అదరగొడుతోంది. మొదటి మ్యాచ్ లో కోల్ కతా చేతిలో స్వల్ప తేడాతో ఓటమి చవి చూసినప్పటికి నిన్న ముంబై తో జరిగిన రెండో మ్యాచ్ లో విధ్వంసం సృష్టించింది. ముంబై బౌలర్స్ ను ఊచకోత కొస్తూ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది. నిన్న జరిగిన మ్యాచ్ లో నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసిన ఎస్‌ఆర్‌హెచ్.. గతంలో ఆర్సీబీ పేరిట ఉన్న (263) రికార్డ్ ను బద్దలు కొట్టింది. హెడ్ (62), అభిషేక్ (63), క్లాసెస్ (80), మర్క్రమ్ (42) ముంబై బౌలర్స్ ను ఉతికారేశారు. .

అయితే సన్ రైజర్స్ నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ముంబై చేధించడం కష్టమే అనుకున్నారంతా. కానీ ముంబై కూడా ఒకానొక దశలో లక్ష్యాన్ని చేధించే విధంగానే కనిపించింది. ఆరంభం నుంచే రోహిత్ శర్మ (26), ఇషన్ కిషన్ (34) ధాటిగా ఆరంభించి మంచి ఓపెనింగ్ అందించారు. ఆ తరువాత నమన్ ధీర్ (30), తిలక్ వర్మ (64), టిమ్ డేవిడ్ (42) చెలరేగి ఆడడంతో లక్ష్య చేధనలో ముంబై కూడా గట్టిగానే పోటీనిచ్చింది. అయితే సన్ రైజర్స్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ తో నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 246 పరుగుల వద్దే నిలిచి పోయింది. దీంతో నిన్నటి మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది సన్ రైజర్స్ హైదరబాద్ జట్టు.

హర్ధిక్ పాండ్య చెత్త కెప్టెన్సీ

ముంబై కెప్టెన్ హర్ధిక్ పాండ్య పై సీజన్ ప్రారంభం నుంచి తీవ్రమైన విమర్శలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన పాండ్య ఫెళవమైన కెప్టెన్సీతో జట్టుకు అపజయాలు మూటాడుతున్నాడనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. గుజరాత్ తో జరిగిన తొలి మ్యాచ్ లో చివరగా బ్యాటింగ్ కు వచ్చి అందరినీ నిరాశ పరిచిన పాండ్య.. నిన్న జరిగిన ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ లో కూడా అందరూ అందరూ బ్యాట్స్ మెన్స్ 200 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తుంటే పాండ్య మాత్రం 150 స్ట్రైక్ రేట్ తో నిరాశ పరిచాడు. అలాగే ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ చేసే టైమ్ లో బుమ్రా వంటి బౌలర్ కు సరైన టైమ్ లో బౌలింగ్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశాడనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో హర్ధిక్ చెత్త కెప్టెన్సీ అంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Also Read:కాల్షియం తగ్గిందా.. ఇవి తినండి!

- Advertisement -