Revanth Reddy:ఆ పథకాల అమలు ఎప్పుడు?

12
- Advertisement -

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ రూ.4 వేలు చేస్తామని, పక్కగా అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆరు గ్యారెంటీలలో భాగంగా ఈ హామీని ఎన్నికల ప్రచారంలో బాగానే ఉపయోగించుకున్నారు హస్తం నేతలు. తీర అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పెంచేదెప్పు అని ప్రజలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. కేవలం పెన్షన్ పెంపు మాత్రమే కాకుండా ఇంకా చాలా హామీలనే రేవంత్ రెడ్డి సర్కార్ పెండింగ్ లో ఉంచింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని నొక్కి చెప్పిన హస్తం నేతలు.. ఇప్పుడేమో తూచ్ అంటున్నారు. అధికారం చేపట్టిన తరువాత హడావిడిగా ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పెంపు వంటి హామీలను అమలు చేసిన తరువాత రూ.500 వంటగ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను అమలు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్.

ఈ పథకాల అమలులో కూడా మెలికలు పెడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇంకా ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ప్రతి నెల రూ.2 వేలు, రైతు భరోసా కింద రూ.15 వేలు, పెన్షన్ రూ.4 వేలు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఇలా చాలానే అమలు చేయాల్సి ఉంది. కానీ ఇవి ఎప్పటి నుంచి అమలు చేస్తారో అనే ప్రశ్నలకు సమాధానం లేక ప్రజలు ఎదురు చూస్తున్న దుస్థితి. ఇక లోక్ సభ ఎన్నికలు మే లో జరగనుండడంతో ఇప్పట్లో కొత్త పథకాల అమలు కష్టమే అనే వాదన వినిపిస్తోంది. పైగా ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇప్పుడు అమల్లోకి వచ్చిన పథకాల కోసమే దాదాపు 16 వందల కోట్ల అప్పు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇంకా అమలు చేయాల్సిన పథకాల కోసం మరింత అప్పు చేయక తప్పదు. మరి ఇంకా పెండింగ్ లో ఉన్న పథకాల అమలు జరుగుతుందా లేదా వీటిని అలాగే అట్టకెక్కిస్తారా ? అనేది చూడాలి.

Also Read:డల్లాస్‌లో రామ్ చరణ్ బర్త్‌ డే వేడుకలు

- Advertisement -