దిల్లీ అసెంబ్లీలో 14 CAG నివేదికలు ప్రవేశపెట్టనుంది బీజేపీ ప్రభుత్వం. దిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం అడ్డుకున్న 14 కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలను బీజేపీ ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.
ప్రధాన నివేదికలు:
1. రాష్ట్ర ఆర్థిక ఆడిట్ నివేదిక (మార్చి 2021 నాటికి)
2.ఆదాయ, ఆర్థిక, సామాజిక, సాధారణ రంగాలు & PSU లపై ఆడిట్ నివేదిక (2020, 2021 వరకు)
3. వాహన కాలుష్యం నివారణ & తగ్గింపు పనితీరు (2021)
4. పిల్లల సంరక్షణ & రక్షణ కార్యక్రమాల పనితీరు (2021)
5. రాష్ట్ర ఆర్థిక నివేదిక (2022)
6. మద్యం సరఫరా పై ఆడిట్ నివేదిక
7. రాష్ట్ర ఆర్థిక నివేదిక (2023)
8. ప్రభుత్వ ఆరోగ్య సేవల నిర్వహణ & మౌలిక సదుపాయాల పనితీరు
9.దిల్లీ రవాణా సంస్థ (DTC) పనితీరు
10. CAG నివేదిక (2022 మార్చి 31 వరకు)
ఈ 14 నివేదికల్లో నాలుగు 2021-22, 2022-23 సంవత్సరాలకు చెందిన ఆర్థిక ఖాతాలు & అనుమతి ఖాతాలు అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
గత డిసెంబర్ 19-20 తేదీల్లో జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా… అప్పటి సీఎం అతిషి (ప్రస్తుతం ప్రతిపక్ష నేత – LoP) పై CAG నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదని విమర్శించారు. AAP ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఒక్కో రూపాయికి కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది అన్నారు.
సోమవారం ప్రారంభమైన మూడు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో, కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా, 47 బీజేపీ ఎమ్మెల్యేలు, 22 AAP ఎమ్మెల్యేలు సహా మొత్తం 70 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read:టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం..