ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం..

2
- Advertisement -

ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు రేఖా గుప్తా. రేఖ గుప్తాతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు. ఢిల్లీకి 9వ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా హిందీలో ప్రమాణం చేశారు. సీఎంతో పాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, మంజీందర్ సింగ్ సిర్సా, రవీంద్ర ఇంద్రరాజ్, కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, పంకజ్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ, ఎన్డీఏ కూటమికి చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు.

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలుంటే ఏకంగా 48 చోట్ల బీజేపీ విజయం సాధించగా ఆప్ 22 స్థానాలకే పరిమితమైంది.

 

Also Read:వ్యాయామం లేకుండా ఇలా బరువు తగ్గండి!

- Advertisement -