భూపాల పల్లి లో రాజలింగ మూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన గండ్ర.. హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతోందన్నారు. ఈ హత్యను బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించాలని కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోందన్నారు.
స్థానిక భూ వివాదం నేపథ్యం లో ఈ హత్య జరిగిందని ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదైందన్నారు.కొందరి ఒత్తిడి తో రాజలింగ మూర్తి భార్య నాపై ఆరోపణలు చేస్తున్నారు ..ఈ హత్యపై సీబీ సీఐడి విచారణ ను కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు అన్నారు. సీబీసీఐడీ కాదు సిబిఐ విచారణ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు ..మేడిగడ్డ పై రాజలింగమూర్తి కోర్టులో కేసు వేశారు ..దాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటున్నాం అన్నారు.
మృతుడి పై భూ వివాదాల ఆరోపణలు ఉన్నాయి ..రౌడీ షీట్ కూడా ఉందని, బీ ఆర్ ఎస్ పై నా పై ఆరోపణలు చేయడం ద్వారా విచారణను ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు అన్నారు. హత్యలో అరెస్టయిన వ్యక్తుల పేర్లతో రాజలింగ మూర్తి పోలీసులకు పిర్యాదు కూడా చేశారు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి కి మతి భ్రమించిందన్నారు.
Also Read:వ్యాయామం లేకుండా ఇలా బరువు తగ్గండి!
బట్ట గాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు ..హత్యారాజకీయాలు కాంగ్రెస్ కు అలవాటు ..బీ ఆర్ ఎస్ హత్యారాజకీయాలను ప్రోత్సహించదు అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పై కూడా కోమటి రెడ్డి నల్లగొండ మున్సిపల్ చైర్మన్ ను హత్య చేశారని ఆరోపించారు. వేముల వీరేశం ఇపుడు కాంగ్రెస్ లోనే ఉన్నారు
..కోమటి రెడ్డి పూటకో మాట మాట్లాడతారు ..ఆయన నోటికి మొక్కాలి ..పోలీసులు నిస్పాక్షిక విచారణ జరిపి దోషులకు కఠిన శిక్షలు పడేలా చేయాలి
..కాంగ్రెస్ నేతలు కుటిల రాజకీయాలు మానుకుంటే మంచిదన్నారు.

