ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారం

15
- Advertisement -

ఇవాళ ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:35కి రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకారం జరగనుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు.

సీఎంగా రేఖా గుప్తాతో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రి రేఖాగుప్తా. ఇక అలాగే ఢిల్లీ నాలుగో మహిళా ముఖ్యమంత్రి రేఖాగుప్తా.

అలాగే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. 30 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయగా రామ్‌లీలామైదానంలో SPG భద్రతను ఏర్పాటు చేశారు.

Also Read:తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం: కేటీఆర్

- Advertisement -