రెజీనా ‘కికి ఛాలెంజ్’.. పోలీసులు వార్నింగ్..

265
regina
- Advertisement -

హాలీవుడ్ సింగర్ పాడిన ‘ఇన్ మై ఫీలింగ్స్’ పాట బాగా ఫేమస్ అవ్వడంతో హాలీవడు నటుడు షిగ్గి ‘కికి ఛాలెంజ్’ పేరుతో కొత్త ఛాలెంజ్ కి శ్రీకారం చుట్టాడు. వెళ్తున్న కారులోని నుంచి దిగి పాటకి అనుగుణంగా డ్యాన్స్ చేయడమే  ఈ ఛాలెంజ్ ఉద్దేశ్యం. ఈ కికి ఛాలెంజ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినీ నటీనటులు, సెలబ్రిటీలు, యువత  ఈ  ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు.

Regina Cassandr

తాజాగా కికి ఛాలెంజ్ ని స్వీకరించారు కథానాయిక రెజీానా. సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న రెజీనా.. వెళ్తున్న కారులోంచి దిగి డ్యాన్స్  చేస్తున్న వీడియోని సోషల్  మీడియాలో పోస్టు చేసంది. రెజీనా డ్యాన్స్ కి నెటిజన్లను ఫిదా అవుతున్నారు. అల్లు శిరీష్, ప్రశాంత్ వర్మ రెజీనా కికి డ్యాన్స్ పై ప్రశంసలు కురిపించారు. మరో వైపు పోలీసులు మాత్రం కికి ఛాలెంజ్ పై మండిపడుతున్నారు. ఈ ఛాలెంజ్ వలన ప్రమాదాలు జరుగుతున్నాయని  పేర్కొంటున్నారు.

సెలబ్రిటీలను యువత అనుసరిస్తుందని… మీరు ఇలాంటి ఛాలెంజ్ లు చేయడం వలన వారు చేసి ప్రమాదాలకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఛాలెంజ్ వలన మీతో పాటు ఇతరులు కూడా గాయపడే అవకాశం ఉందని ముంబై, కర్ణాకట పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఛాలెంజ్ చేస్తూ గాయపడిన వీడియోలను తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

https://twitter.com/AlluSirish/status/1023574946906132480

- Advertisement -