గ్రీన్‌ సవాల్‌ స్వీకరించిన చిరు..

470
Chiranjeevi Participates In Haritha Haram

తెలంగాణాలో హరితహారం కార్యక్రమం ఓ ఉద్యమంలా ముందుకు సాగుతోంది. మొక్కలు నాటే సవాల్ ఒకరినుంచి మరొకరికి వెళుతోంది.ఇటీవల కేటీఆర్ సవాల్ ని స్వీకరించిన మహేష్ బాబు తన కుమార్తెతో మొక్క నాటి తన బాధ్యత నిర్వర్తించాడు. వీరితోపాటు మేము సైతం అంటూ పలువురు సినీరాజకీయ సెలబ్రిటీలు ముందుకొచ్చారు. మొక్కను పెంచేవాడే సూపర్‌స్టార్‌ అన్న చందంగా ఎవరికి వారు సినిమా తారలు ఏదో ఒక మొక్కను నాటడం ఆ ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుండడంతో హరితహారానికి బాగా ప్రాచుర్యం వస్తోంది.

Mahesh babu

తాజాగా ప్రముఖ మీడియా అధినేత నరేంద్ర చౌదరి మెగాస్టార్‌కు గ్రీన్‌ సవాల్‌ విసిరాడు. మెగాస్టార్ చిరంజీవి హరితహారం ఛాలెంజ్ ని స్వీకరించి తన గార్డెన్‌లో మొక్క నాటారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నవారి జాబితాలో ఇప్పుడు చిరు కూడా చేరారు. చిరు మొక్కలు నాటుతున్న ఫోటోల్ని అధికారికి పీఆర్ వో సహా అభిమానులు ప్రమోట్ చేస్తున్నారు. మెగాస్టార్ స్వయంగా మొక్కను నాటి దానికి నీళ్లు పోస్తున్న ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతున్నాయి. వీటిని మెగాభిమానులంతా షేర్ చేస్తూ ఎవరికి వారు హరితహారం చేపట్టాలని ఉద్యమిస్తున్నారు. మంచి కోసం మేము సైతం అంటూ మెగాభిమానులు కదిలొస్తున్నారు.

Chiranjeevi

ప్రస్తుతం చిరు సైరా నరసింహారెడ్డి మూవీలో నటిస్తుండగా ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి తెరకెక్కెస్తున్నారు. రాంచరణ్ ఈ చిత్రాన్ని250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండడం విశేషం. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా చిత్రాన్ని రూపొందిస్తున్నారు.