హీరోయిన్ శ్రీయ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 15 ఏళ్లు అవుతోంది. బాలీవుడ్ తో పాటు సౌత్ లో అన్ని భాషల్లోనూ నటించడంతో పాటు దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటించింది. ఆమె వయసు 33. ఇప్పటికీ శ్రీయ తన ఫిజిక్, ఫిగర్ ఏ మాత్రం చెక్కు చెదరకుండా మెయిటేన్ చేస్తోంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన డైట్ తీసుకుంటూ తన అందాన్ని కాపాడుకుంటోంది. అందుకే ఏళ్ల తరబడి సెక్సీ ఫీగర్గా వెలిగిపోతోంది.
అయితే రీసెంట్ గా జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో ఈ అమ్మడు ఇచ్చిన క్లివేజ్ షోకి ఎంతటివారైనా ఫిదా అవ్వాల్సిందే. ఆ ఫ్యాషన్ షోలో ఆమెకు పోటీగా వచ్చిన వెరీ యంగ్ హీరోయిన్స్ దిశా పటాని- నర్గిస్ ఫక్రి ల కంటే తన అందాలనే అందరు చూసేలా తెగ ఆకట్టుకుంది. ఓ విధంగా చెప్పాలంటే శ్రియా వారికి గట్టిపోటీని ఇచ్చింది అని చెప్పాలి. దాదాపు సినిమా ఫీల్డ్ లోకి వచ్చి పద్దెనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికి ఇంకా 16 అన్నట్టు తన ఘాటైన సోయగాలతో శ్రియా మతి పోగొడుతోంది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం అంతగా ఆఫర్స్ రాకున్నా వచ్చిన సినిమాలనే చక్కగా చేసుకుంటూ.. మరో ఐదేళ్లు కెరీర్ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ ఏడాది మొదట్లో బాలయ్య తో “గౌతమి పుత్ర శాతకర్ణి” సినిమాతో మంచి హిట్ అందుకుని పరవాలేదు అనిపించింది. ఇప్పుడు మళ్లీ మరో సారి బాలయ్యతో జోడి కట్టి “పైసా వసూల్” సినిమాతో అయినా భారీ హిట్ కొట్టాలనుకుంటోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అయినా శ్రీయకు మంచి విజయాన్ని అందించి తిరిగి ఆమె కెరియర్న్ గాడిలో పెడుతుందా అనేది చూడాలి.