మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – విజువల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘RC 15’. ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికే ఎన్నో పుకార్లు వైరల్ అయ్యాయి. వాటిలో ఏది నిజమో అని తెలీక ముందే.. ఇప్పుడు మరో పుకారు షికారు చేస్తోంది. 2024 సంక్రాంతికి ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురావాలి అనేది దర్శకుడు శంకర్ ప్లాన్. అందుకు ఓ కారణం ఉంది. ‘RC 15’ ఒక పాన్ ఇండియా సినిమా. పైగా అందులోనూ పిరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా.
పల్లెటూరి రాజకీయాలు కూడా ఈ సినిమాలో మెయిన్ పాయింట్. సో.. సంక్రాంతికి అందరూ పల్లెటూర్లకు వెళ్లడం ఇండియా వైడ్ గా ఉన్న కల్చర్. కాబట్టి.. ఈ భారీ సినిమాకి సంక్రాంతి రిలీజే కరెక్ట్ అని శంకర్ ఫిక్స్ అయ్యాడు. ఇక రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నాడని టాక్. రాజకీయ డ్రామా అంటే.. సినిమా కాస్త సీరియస్ టోన్ లో సాగుతుంది అనుకునేరు. కేవలం ప్లాష్ బ్యాక్ మాత్రమే సీరియస్ డ్రామా అట.
ఇక మిగిలిన పార్ట్ మొత్తం శంకర్ ఎంటర్ టైన్ గానే సినిమాని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా మొదట ఫ్యామిలీ డ్రామా అన్నారు. కానీ.. ఇది కూడా పొలిటికల్ డ్రామా అని తెలిసే సరికి ఫ్యాన్స్ కి సినిమా పై ఆసక్తి మరింతగా రెట్టింపు అయింది. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ తాలూకు పాలనను చాలా గొప్పగా చూపిస్తారట. ఏది ఏమైనా పొలిటికల్ డ్రామాలను శంకర్ అద్భుతంగా హ్యాండిల్ చేయగలడు.
ఇవి కూడా చదవండి..