వచ్చే ఎన్నికల్లో యుద్దమే !

16
- Advertisement -

అధికార వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికలపై కూడా గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఈసారి అంతకుమించి అన్నట్లుగా 175 స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేస్తూ ముందుకు సాగుతున్నారు సి‌ఎం జగన్. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే 99 శాతం హామీలను అమలు చేశామని, తాము చేసిన మంచే మళ్ళీ అధికారం ఇస్తుందని వైఎస్ జగన్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఇప్పటికే ప్రజల్లో వైసీపీ పాలనపై అభిప్రాయాలను సేకరిచేందుకు ” గడపగడపకు మన ప్రభుత్వం ” అనే కార్యక్రమం ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, నేతలను ఇలా పార్టీకి సంబంధించిన అందరిని కూడా ప్రజల్లోనే ఉండేలా చూస్తున్నారు.

అలాగే త్వరలో ప్రవేశ పెట్టబోయే గృహ సారథులా ద్వారా కచ్చితమైన ఓటు శాతాన్ని కనుకునే ప్రయత్నం చేయబోతున్నారు. ఇలా ఇప్పటి నుంచే ఎలక్షన్ ప్లాన్ లను అమలు చేస్తూ పక్కా వ్యూహరచనతో ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్. అయితే ఈ ఎన్నికలు వైసీపీతో పాటు టీడీపీ, జనసేన పార్టీలకు కూడా ముఖ్యమే. ఆ రెండు పార్టీలు కూడా అధికారం కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సర్కార్ ను గద్దె దించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సి‌ఎం జగన్ చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో యుద్దం జరగబోతుందని.. పేదల ప్రభుత్వానికి, పెత్తందారీ పార్టీకి మద్య యుద్దం అని టీడీపీని ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు.

కరువుతో స్నేహం చేసే చంద్రబాబుకు మీ బిడ్డనైనా కూడా మద్య యుద్దం జరగబోతుందని తనదైన రీతిలో చెప్పుకొచ్చారు సి‌ఎం జగన్. దుష్టచతుష్టయానికి తోడు దత్తపుత్రుడు కలిశాడని పవన్ ను ఉద్దేశించి జగన్ ఎద్దేవా చేశారు. వీరిద్దరికి 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం ఉందా ? అంటూ సవాల్ విసిరారు. తనకు దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, తన పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. వారు ప్రజలకు ఏనాడూ మంచి చేయలేదని అందుకే వారికి దైర్యం లేదని, కానీ నాకు పోటీ చేసి గెలుస్తాననే నమ్మకం ఉందంటూ ” సి‌ఎం జగన్ అన్నారు. ప్రస్తుతం సి‌ఎం జగన్ చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి…

చిరు వెంట బీజేపీ.. మెగాస్టార్ నమ్ముతారా?

అమిత్ షా బేటీ.. ఇప్పుడేందుకు ?

మాది కుటుంబ పాలన…కేటీఆర్

- Advertisement -