చిరు వెంట బీజేపీ.. మెగాస్టార్ నమ్ముతారా?

54
- Advertisement -

బీజేపీ చిరంజీవి వైపు చూస్తుందా ? చిరంజీవికి ఎలాగైనా కాషాయ కండువా కప్పాలని ప్రయత్నిస్తుందా ? అసలు చిరు విషయంలో బీజేపీ ప్లానేంటి ? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి ఎందుకంటే ఇటీవల తాజాగా చిరంజీవి తో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ అయ్యారు. అది కూడా చిరు నివాసంలోనే. అక్కినేని నాగార్జున కూడా అక్కడే ఉన్నప్పటికి చిరు చుట్టూనే పోలిటికల్ హిట్ పెరుగుతోంది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా చిరు పై స్పెషల్ ఫోకస్ పెట్టింది కాషాయ పార్టీ. ఎలాగైనా కాషాయ చిరుకి కాషాయ కండువా కప్పాలని కమలనాథులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఆ మద్య ఏపీలోని భీమవరంలో జరిగిన విగ్రహావిష్కరణ కు ముఖ్య అతిధి గా హాజరయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. .

అప్పుడు చిరుకి కూడా ప్రత్యేక ఆహ్వానం అందింది. అయితే జనసేనతో పొత్తులో ఉన్నప్పటికి పవన్ ను కాకుండా చిరుని ఆహ్వానించడంతోనే.. బీజేపీ చిరుపై ఫోకస్ పెట్టిందనే విషయం ఇట్టే అర్థమైపోయింది. అంతేకాకుండా అసమయంలో సి‌ఎం జగన్ కంటే చిరుతోనే ఎక్కువ సక్యతగా మెలిగారు ప్రధాని మోడీ. ఇదిలా ఉంచితే గత ఏడాది గోవాలో జరిగిన ఐఎఫ్ఎఫ్ఐ అవార్డ్ ల్లో చిరు కు పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ తో సత్కరించింది భారత ప్రభుత్వం.. అసమయంలోనే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బీజేపీలో చేరాలని చిరుకు ఆహ్వానం పలికారట. కానీ చిరు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఇక ఇప్పుడు మరోసారి చిరుతో అనురాగ్ ఠాకూర్ భేటీ కావడంతో చిరు పోలిటికల్ రీఎంట్రీ ఖాయమా అనే సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

అయితే తాను ఇకపై రాజకీయాల్లోకి వెళ్ళే ప్రసక్తే లేదని చిరు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. రాజకీయాలు తనకు సెట్ కావని, అక్కడ నెట్టుకురావడం చాలా కష్టమని, ఇకపై రాజకీయాల్లోకి వెళ్ళే ప్రసక్తే లేదని చిరు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ చిరుకు ఉన్న ఇమేజ్ కారణంగా ఏపీలో బలపడాలనేది కాషాయ పార్టీ ప్లాన్ గా తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. పార్టీని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకులు ఏపీ బీజేపీలో లేరనే చెప్పాలి. అందుకే ఆలోటు ను భర్తీ చేసేందుకే చిరు వైపు చూస్తోందట కాషాయ పార్టీ. ప్రస్తుతం జనసేనతో బీజేపీ పొత్తులో ఉంది. అదే సమయంలో చిరును కూడా పార్టీలో కలుపుకుంటే అన్నదమ్ముల ప్రభావంతో ఏపీలో తిరుగులేని శక్తిగా బీజేపీని నిలపాలని కమలనాథుల ప్లాన్ గా తెలుస్తోంది. అయితే చిరు బీజేపీని ఎంతవరకు నమ్ముతారనేది ఆసక్తికరం. అదే టైమ్ లో బీజేపీని నమ్మి చిరు పోలిటికల్ రీఎంట్రీ ఇస్తారా అనేది కూడా ప్రశ్నార్థకమే. మరి చిరు విషయంలో బీజేపీ వేస్తున్న ఎత్తులు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి…

చిరంజీవి ఇంటికి కేంద్రమంత్రి…

ఎన్టీఆర్ ఎందుకు రాలేదంటే..?

ఆచార్య సెట్ అగ్గి పాలైంది

- Advertisement -