మరోసారి రవితేజతో మిల్కి బ్యూటీ రొమాన్స్

606
Raviteja Tamahha
- Advertisement -

మాస్ మాహారాజా రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ శర వేగంగా జరుపుకుంటుంది. ఇటివలే ఈమూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ మూవీ తర్వాత నేను లోకల్ దర్శకుడు త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో చేయనున్నాడు.

ప్రస్తుతం స్క్రీప్ట్ వర్క్ పనిలో బిజీగా ఉన్నాడు దర్శకుడు. తాజాగా ఉన్న సమాచారాం మేరకు రవితేజ సరసన తమన్నా నటించనుందని తెలుస్తుంది. త్వరలోనే ఈమూవీ ప్రారంభంకానుంది. కాగా రవితేజ తమన్నా కలిసి గతంలో బెంగాల్ టైగర్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో రవితేజ లుక్ డిఫరెంట్‌గా ఉంటుందని, తమన్నా పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు.

- Advertisement -