రవితేజ…ఆన్ డ్యూటీ

75
ramarao
- Advertisement -

మాస్‌ మహారాజా రవితేజ, దర్శకుడు శరత్‌ మండవ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. దివ్యాంశా కౌశిక్, రాజీషా విజయన్‌ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలోనే ఉన్నప్పటికీ, ఈ చిత్రంపై ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇందుకు తగ్గట్లుగానే చిత్రయూనిట్‌ కూడా ఎగ్రెసివ్‌ ప్రొమోషన్స్, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ ప్రేక్షకులు అటెన్షన్‌ను గ్రాబ్‌ చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఖరారైన మాస్‌ టైటిల్‌ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’, ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ రవితేజ అభిమానులతో పాటుగా సినిమా లవర్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్సెస్ ను చిత్రీకరిస్తున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ గా వచ్చే ఈ ఫైట్ సీన్ .. సినిమాకే హైలైట్ గా నిలుస్తుందట. కథకి చాలా కీలకమైన ఈ ఫైట్ సీన్ అద్భుతంగా వస్తోందని చెబుతున్నారు మేకర్స్.

షూటింగ్ మొదలైన రోజు నుంచి ఈ సినిమాపై ఇండస్ట్రీలో చాలా పాటిటివ్ బజ్ నడుస్తోంది. సిన్సియర్ యమ్మార్వో గా రవితేజ యాక్టింగ్ ఓ లెవెల్ లో ఉండబోతుందని అంటున్నారు.

- Advertisement -