వీరశంకర్‌గా రవితేజ!

110
krack

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్‌’. ఈ సినిమా నిర్మాణ ప‌నులు ముగింపు ద‌శ‌లో ఉన్నాయి. రవితేజ సరసన శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా స‌ముద్ర‌క‌ని కీరోల్ పోషిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన రవితేజ కొత్త స్టిల్‌ను గురువారం విడుదల చేసింది చిత్రబృందం. ఆ పోస్టర్ లో పోలీస్ డ్రెస్ లో మీసం తిప్పుతున్న రవితేజ మాస్ లుక్ తో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.

రవితేజ వేసుకున్న పోలీస్ డ్రెస్ పై ‘పి. వీర శంకర్’ అనే పేరు కనిపిస్తుండగా కరోనా కారణంగా అన్ని థియేటర్స్ మూతపడటంతో క్రాక్‌ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.