రవితేజ క్రాక్‌ ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌

190
krack

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘క్రాక్‌’. ఈ సినిమా నిర్మాణ ప‌నులు ముగింపు ద‌శ‌లో ఉన్నాయి. చివ‌రి షెడ్యూల్ మిన‌హా మిగ‌తా షూటింగ్ అంతా పూర్త‌వ‌గా, త్వ‌ర‌లో ఆ షెడ్యూల్‌ను జ‌ర‌ప‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.ఇదివ‌ర‌కు విడుద‌ల చేసిన ర‌వితేజ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు, టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ముఖ్యంగా పోలీసాఫీస‌ర్ గెట‌ప్‌లో రవితేజ ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తున్నార‌నే ప్ర‌శంస‌లు ల‌భించాయి.

తాజాగా గురువారం చిత్ర బృందం ఒక కొత్త స్టిల్‌ను రిలీజ్ చేసింది. ఇందులో పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ర‌వితేజ.. క‌ళ్ల‌కు గాగుల్స్ పెట్టుకొని మీసం మెలితిప్పుతూ ఇంటెన్స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. ఇంకో చేతిలో కూల్‌డ్రింక్ బాటిల్ క‌నిపిస్తోంది. ఈ లుక్ ప్ర‌కారం ఆయ‌న ఏపీ పోలీస్ ఆఫీస‌ర్‌ పి. వీర‌శంక‌ర్ అని తెలుస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకొని త‌యారుచేసిన క‌థ‌తో ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు గోపీచంద్ తెర‌కెక్కిస్తున్నారు. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రంలోని ఓ పాట‌ను త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌నున్నారు.ఈ సినిమాతో శ్రుతి హాస‌న్ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. స‌ముద్రక‌ని ఓ కీల‌క పాత్ర చేస్తుండ‌గా, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ నెగ‌టివ్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు.స‌ర‌స్వ‌తీ ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా జి.కె. విష్ణు ప‌నిచేస్తున్నారు. థియేట‌ర్లు తెరుచుకోగానే ‘క్రాక్‌’ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.