క్రాక్‌ అయిన రవితేజ…

401
raviteja krack

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డాన్ శీను, బ‌లుపు వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత తెరకెక్కుతున్న ఈ క్రేజీ కాంబినేష‌న్‌ టైటిల్ ఖరారైంది. క్రాక్‌ అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

బి.మ‌ధు నిర్మాణంలో ర‌వితేజ చేస్తున్న 66వ చిత్రం ఇది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేవిధంగా ఈ సినిమా ఉండేలా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నారు. వీరిద్ద‌రి హ్యాట్రిక్ సినిమా కావ‌డంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రంలో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తమిళ నటుడు సముద్రఖని కీలకపాత్ర పోషించనున్నారు.

ప్రస్తుతం రవితేజ…ఐ ఆనంద్ దర్శకత్వంలో సైంటిఫిక్ థ్రిల్లర్‌ మూవీలో నటిస్తున్నారు. షూటింగ్ చివరిదశకు చేరుకోగా రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్‌టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.