టీమిండియా కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌..

238
Ravi Shastri
- Advertisement -

టీమిండియాకు షాక్‌.. జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రవిశాస్త్రికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో రవితోపాటు మరో ముగ్గురిని ఐసోలేషన్‌కు పంపారు. వీరిలో ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫిజియో నితిన్ పటేల్ ఉన్నారు. వీరందరినీ జట్టు నుంచి వేరు చేసి ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ నెల 10 భారత్-ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్‌లో చివరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్టు సభ్యులు మాంచెస్టర్ వెళ్లినా, ఐసోలేషన్‌లో ఉన్న ఈ నలుగురు మాత్రం లండన్‌లోనే ఉంటారు.

రవిశాస్త్రికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆర్టీ-పీసీఆర్ టెస్టు కూడా నిర్వహించారు. ఈ టెస్టు ఫలితం వచ్చేవరకు ఆయనను ఐసోలేషన్ లో ఉంచనున్నారు. అయితే టీమిండియా ఆటగాళ్లలో ఎవరూ కరోనా బారినపడలేదని, ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టుకు ఎలాంటి ఆటంకాలు లేవని మేనేజ్ మెంట్ స్పష్టం చేసింది. రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆటగాళ్లకు, సహాయక సిబ్బంది మొత్తానికి ర్యాపిడ్ యాంటీజెన్, ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించారు.

- Advertisement -